మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో రూ.13 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. గ్రామస్థులు మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ర్యాలీలు నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని వెల్లడించారు. ప్రజా ప్రతినిధులమంతా ఒక ఉమ్మడి కుటుంబంలా అధికారుల సహాయసహకారాలతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రితోపాటు ఎంపీ మాలోత్ కవిత, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ బిందు, ఎమ్మెల్యే హరిప్రియ, కలెక్టర్ శివలింగయ్య పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ఎద్దును తప్పించబోయి ప్రమాదం.. 12 మంది దుర్మరణం