ETV Bharat / state

ఉపాధి కూలీలతో ముచ్చటించిన మంత్రి ఎర్రబెల్లి - ఉపాధి పనులు

లాక్​డౌన్​ వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఉపాధి లేకుండా ఇబ్బంది పడకూడదని కొనసాగిస్తున్న ఉపాధి హామీ పనులను రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు పరిశీలించారు. పనుల నిర్వహణ తీరును పర్యవేక్షించి.. కూలీలతో ముచ్చటించారు.

Minister Errabellli Chit Chat With National Rural Employment Labor
ఉపాధి కూలీలతో ముచ్చటించిన మంత్రి ఎర్రబెల్లి
author img

By

Published : May 26, 2020, 6:09 PM IST

మహబూబాబాద్​ జిల్లా నర్సింహులపేట మండలం బొజ్జన్నపేట గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను రాష్ట్ర పంచాయితీ రాజ్​, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు పరిశీలించారు. పనుల నిర్వహణ తీరును స్వయంగా పరిశీలించి కూలీలతో ముచ్చటించి పలు వివరాలు తెలుసుకున్నారు. ఉపాధి కూలీలకు గిట్టుబాటు కూలీ పడేలా చూడాలని అధికారులకు సూచించారు. కరోనా నేపథ్యంలో అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో మరో 66 కరోనా పాజిటివ్‌ కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.