ఇదీ చదవండి:సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి : ముఠా గోపాల్
దత్తత తీసుకుంటా... కానీ ఒక షరతు: ఎర్రబెల్లి
వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో తెరాస కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. లోక్సభ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి మాలోతు కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి ఎర్రబెల్లి విజ్ఞప్తి చేశారు.
గెలుపే లక్ష్యంగా కార్యకర్తలంతా కృషిచేయాలి
కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి కుంటుపడిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. నర్సంపేటలో జరిగిన తెరాస కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. మూడునెలల్లో కాళేశ్వరం, ఎస్సారెస్పీ పనులు పూర్తి చేసి ప్రతి గ్రామానికి నీరందించేలా కృషిచేస్తామన్నారు. కార్యకర్తలంతా ఇంటింటికీ తిరిగి తెరాస ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కష్టించి పనిచేసే కార్యకర్తలకు పార్టీలో తగిన ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. గ్రామాల్లో 80శాతం, మండలంలో 70 మెజార్టీ వచ్చిన గ్రామాలను దత్తత తీసుకుంటాన్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు కార్యకర్తలు మంత్రి సమక్షంలో తెరాసలో చేరారు. కార్యక్రమంలో మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీ అభ్యర్థి కవిత, ఎమ్మెల్సీ సత్యవతి రాఠోడ్, ఎంపీ సీతారాంనాయక్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి:సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి : ముఠా గోపాల్
Last Updated : Mar 28, 2019, 7:21 PM IST