మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామంలో 100 స్మైల్ ఛారిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన గ్రంథాలయాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. 100 స్మైల్ ఛారిటీ ఫౌండేషన్ లాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు చేయాలని సూచించారు. డబ్బు ఉండడమే కాదు సేవ చేసే గుణం ఉండాలని హితవు పలికారు.
ప్రతి గ్రామంలో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని స్వచ్ఛంద సంస్థలకు సూచించారు. ఈ సందర్భంగా 100 స్మైల్ ఛారిటీ ఫౌండేషన్ వారిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించారు. ఈ కార్యక్రమంలో తొర్రూరు జడ్పీటిసీ శ్రీనివాస్, రైతు బంధు సమితి అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.