ETV Bharat / state

తొర్రూరును రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుపుదాం: ఎర్రబెల్లి

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్​లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి.. తొర్రూరు పట్టణాన్ని రాష్ట్రంలోనే ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

minister-errabelli-dayakar-rao-visited-thorrur-and-started-various-development-programmes
ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి: ఎర్రబెల్లి
author img

By

Published : Jan 27, 2021, 4:03 PM IST

తొర్రూరు పట్టణాన్ని రాష్ట్రంలోనే ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హామీ ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మున్సిపల్ కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్, రాజారావు పార్కును ప్రారంభించారు. అనంతరం మున్సిపాలిటీ పాలకవర్గం ప్రథమ వార్షికోత్సవ సభలో మంత్రి పాల్గొన్నారు.

పట్టణాభివృద్ధిలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గౌతమ్, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్​ ముఖ్య పాత్ర పోషిస్తున్నారని మంత్రి కొనియాడారు. కరోనా కష్టకాలంలో సంక్షేమ పథకాలను అందించిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. మిషన్ భగీరథ నీళ్ల పైన కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని.. వాటిని మానుకోవాలని మంత్రి హెచ్చరించారు.

ఇదీ చూడండి: రసాభాసగా మారిన నగరపాలిక సర్వసభ్య సమావేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.