ETV Bharat / state

'సంక్షోభంలోనూ రైతుబంధు, పింఛన్లు అప్పు తెచ్చి ఇస్తున్నాం'

కరోనా సంక్షోభంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం భారీగా పడిపోయినప్పటికీ అప్పు తెచ్చి రైతుబంధు, పింఛన్​ పథకాలను కొనసాగిస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఆరు నెలలు ఓపిక పడితే సీఎం కేసీఆర్​ నిరుద్యోగులకు మంచి అవకాశాలు కల్పిస్తారన్నారు.

minister errabelli dayakar rao on mlc Election Preparatory Meeting at Mahabubabad District
'సంక్షోభంలోనూ రైతుబంధు, పింఛన్లు అప్పు తెచ్చి ఇస్తున్నాం'
author img

By

Published : Nov 1, 2020, 8:18 PM IST

రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నెల 15 వేలకోట్ల రూపాయల ఆదాయం వచ్చేదని.. కరోనా సంక్షోభంతో 350 కోట్ల రూపాయలు మాత్రమే వస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రైతుబంధు, పింఛన్లకు అప్పు తెచ్చి ఇస్తున్నామన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

నిరుద్యోగులంతా ఆరు నెలలు ఓపిక పడితే సీఎం కేసీఆర్​ నిరుద్యోగులకు మంచి అవకాశాలు కల్పిస్తారన్నారు. రాష్ట్రంలో సన్న వడ్లకు ఎక్కువ ధర పెట్టాలని భాజపా నాయకులు గగ్గోలు పెడుతున్నారన్నారు. అయితే సన్న వడ్లకు ఒక్క రూపాయి కూడా ఎక్కువ పెట్టొద్దని కేంద్రం లేఖ రాసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కేంద్రానికి పన్నుల రూపంలో 50 నుంచి 60వేలకోట్ల రూపాయలు చెల్లిస్తుందని పేర్కొన్నారు. దేశంలో మహారాష్ట్ర తరువాత అత్యధికంగా తెలంగాణా చెల్లిస్తుందన్నారు. కేంద్రం నుంచి మాత్రం 10 నుంచి 12 వేల కోట్ల రూపాయలే వస్తున్నాయని స్పష్టం చేశారు.

లక్షన్నర ఉద్యోగాలు భర్తీ చేశాం:

ప్రతిపక్షాలు ఉద్యోగాలు భర్తీ చేయలేదని గగ్గోలు పెడుతున్నాయని.. పోలీస్, విద్యుత్, వ్యవసాయ శాఖల్లో భారీగా ఉద్యోగాలు నింపామని ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. మొత్తం దాదాపు లక్షన్నర ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. ప్రశ్నించే వాడిని కాదని.. పనిచేసే వారిని గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి మంత్రి సత్యవతి రాఠోడ్, ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పట్టభద్రులు పాల్గొన్నారు.

'సంక్షోభంలోనూ రైతుబంధు, పింఛన్లు అప్పు తెచ్చి ఇస్తున్నాం'

ఇదీ చూడండి: దుబ్బాకలో ముగిసిన ప్రచార పర్వం.. ఈనెల 3న పోలింగ్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.