ETV Bharat / state

తెలంగాణలో మహిళలకే అధిక ప్రాధాన్యం: ఎర్రబెల్లి - మహిళలకు స్త్రీనిధి చెక్కుల పంపిణీ

ప్రతి మహిళకి జీవనోపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు అన్నారు. తొర్రూరు డివిజన్ కేంద్రంలో మహిళా సంఘాలకు శ్రీనిధి ద్వారా రూ.32 కోట్ల రుణాలను అందజేశారు.

ప్రతి మహిళకు జీవనోపాధి కల్పనే ప్రభుత్వ లక్ష్యం

author img

By

Published : Jan 31, 2021, 10:05 PM IST

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ డివిజన్ కేంద్రంలో మహిళలకు స్త్రీనిధి రుణాల చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమానికి హాజరైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు... మహిళలకు చెక్కులు అందించారు.

మహిళలకి ఉపాధి, గౌరవం, ప్రాధాన్యతను ఇచ్చిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని మంత్రి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి, మిషన్​ భగీరథ పథకాలు దేశానికే ఆదర్శమన్నారు. పాలకుర్తి నియోజవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్​ అభిలాష అభినవ్, రాష్ట్ర స్త్రీ నిధి ఎండీ విద్యాసాగర్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 'వారందరికీ అందేంతవరకు పల్స్​ పోలియో కార్యక్రమం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.