తొర్రూరు మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని తెలిపారు పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లితో పాటు కలెక్టర్ వీపీ గౌతమ్ పాల్గొన్నారు. పట్టణంలోని వార్డుల్లో మంత్రి కలియతిరిగారు.
మున్సిపాలిటీలోని కౌన్సిలర్లు పట్టణ ప్రగతి కార్యక్రమంలో ముందుండాలని మంత్రి తెలిపారు. పది రోజుల పాటు జరిగే పట్టణ ప్రగతి కార్యక్రమానికి రూ. 16 లక్షల నిధులు విడుదల చేశామన్నారు. పట్టణ ప్రగతిలో కౌన్సిలర్లు అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.