మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లిలో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఓ వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యక్తి శరీరం ఛిద్రమైంది.
మృతుడి వివరాలు తెలియాల్సి ఉండగా... అతని వయసు సుమారు 40 సంవత్సరాలుగా ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
ఇవీచూడండి: మరో 8 మంది ఇండోనేసియా వాసుల గుర్తింపు.. ఫివర్ ఆసుపత్రికి తరలింపు