మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం బాల్యా తండా గ్రామపంచాయతీలో జరిగిన ఫ్రైడే-డ్రైడే కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ ఆంగోత్ బిందు పాల్గొన్నారు. గ్రామంలోని ఇంటింటికి వెళ్లి కుండీలలో నిల్వ ఉన్న నీటిని పారబోయించారు. చెట్ల పాదులను శుభ్రం చేసుకోవాలని, ఇంటి వాతావరణం పరిశుభ్రంగా, పచ్చదనంతో ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. ఇంటి పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు చెత్తను తొలగించుకోవాలని... అప్పుడే కుటుంబం ఆరోగ్యవంతంగా ఉంటుందన్నారు.
గ్రామంలో ప్రతిరోజు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని, కాలువలు శుభ్రం చేయాలని సర్పంచ్‌ను, కార్యదర్శిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బాల్య తండా సర్పంచ్ లక్ష్మి, కార్యదర్శి, గ్రామస్ఖులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: విలేజ్ లెర్నింగ్ సెంటర్లలో విద్యార్థులకు పాఠాలు