విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల మూగజీవాలు బలయ్యాయి. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం నల్లగుట్ట తండ గ్రామ పంచాయతీ శివారు సఫారీ తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. తండా శివారులోని వ్యవసాయ బావి వద్ద ఆహారం కోసం వెళ్లిన మేకలు, గొర్రె పోతులు సింగిల్ ఫేస్ ట్రాన్స్ ఫార్మర్ ఎర్త్ వైరుకు తగిలి అక్కడికక్కడే మృతి చెందాయి.
దీనిపై విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ వారు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రి సమయంలో తెలియని వారు ఎవరైన స్తంభాన్ని తాకితే ప్రమాదం సభవిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తమకు నష్టం వాటిల్లిందని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. దీనిని దృష్టిలో పెట్టుకొని తమకు నష్ట పరిహారం చెల్లించాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: కనిష్ఠ స్థాయికి శ్రీశైలం నీటిమట్టం