మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం ఎజెన్సీ మండలాల్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎస్పీ కోటిరెడ్డి పర్యటించారు. మర్రిగూడెం, కామారం, మహాదేవునిగూడెం, ముస్మి గ్రామాల్లోని మావోయిస్టు కుటుంబాలను కలిసి వారి స్థితిగతులపై ఆరా తీశారు.
గంగారం మండలం మడగూడకు చెందిన మవోయిస్టు అగ్రనాయకుడు హరిభూషన్ అలియాస్ యాప నారాయణ జనజీవన స్రవంతిలో కలవాని ఆయన తండ్రి రంగయ్యకు సూచించారు. ఎస్పీ వెంట ట్రైనీ ఐపీఎస్ అధికారి యోగేష్ గౌతమ్, మహబూబాబాద్ డీఎస్పీ నరేష్, సీఐలు, ఎస్సైలు ఉన్నారు.
ఇదీ చూడండి: నిజామాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత?