ETV Bharat / state

కుమారుడితో కలిసి రక్తదానం చేసిన ఎస్పీ కోటిరెడ్డి - మహబూబాబాద్​ జిల్లా వార్తలు

మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఎస్పీ కోటిరెడ్డి తన కుమారుడితో కలిసి రక్తదానం చేశారు. తలసేమియాతో బాధపడుతున్న వారికోసం ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు.

mahabubabad sp blood donate with his son
తన కుమారుడితో కలిసి రక్తదానం చేసిన ఎస్పీ
author img

By

Published : May 27, 2020, 7:42 PM IST

తలసేమియాతో ఇబ్బందులు పడుతున్న వారి కోసం పోలీసుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం డివిజన్ల వారిగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని మహబూబాబాద్​ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్స్​లో మహబూబాబాద్ సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై కుమారుడితో కలిసి రక్తదానం చేశారు. ఈ రక్తదాన శిబిరంలో సుమారు 150 మంది పోలీసులు, యువకులు రక్తదానం చేశారు.

గత మూడు సంవత్సరాలుగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలను నిర్వహించి సుమారు 2 వేల యూనిట్ల రక్తం సేకరించామని, రక్త దానం చేయడంలో మహబూబాబాద్ ప్రజలు, పోలీసులు ముందున్నారని ఎస్పీ తెలిపారు. రక్తం కొరత తీర్చేందుకే బ్లడ్ క్యాంపులను నిర్వహిస్తున్నామని అన్నారు. రక్తదానం చేసేందుకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులతో పాటు తమ కుమారుడు కూడా రక్తం ఇవ్వడానికి ముందుకు వచ్చాడన్నారు. పది రోజుల్లో తొర్రూరు సబ్ డివిజన్​లో కూడా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఇవీ చూడండి: వానాకాలం పంటల సాగు ప్రణాళికపై అవగాహన సదస్సు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.