Mahabubabad District Court Verdict on Deekshith Reddy Murder Case : మహబూబాబాద్‌లోని కృష్ణకాలనీకి చెందిన కుసుమ రంజిత్‌రెడ్డి-వసంతల పెద్ద కుమారుడు దీక్షిత్‌రెడ్డి ( Deekshith Reddy).. 2020 అక్టోబర్‌లో అపహరణకు గురయ్యాడు. బాబు కిడ్నాప్ వ్యవహారం అప్పట్లో సంచలనం రేపింది. సవాల్‌గా మారిన కేసును.. పోలీసులు అప్పట్లో చాకచక్యంగా ఛేదించారు. కిడ్నాప్ చేసిన గంటల వ్యవధిలోనే బాలుడిని హత్య చేయటంతో ఘటన విషాదాంతమైంది.
కుమార్తె వరుసయ్యే బాలికపై హత్యాచారం.. కామాంధుడికి ఉరిశిక్ష
Deekshith Reddy Murder Case Updates : తొలుత డబ్బు డిమాండ్ చేసిన సాగర్ ఆ సొమ్ము తయారు చేసుకునేలోపే.. కేసముద్రం రోడ్‌లోని దానవాయి గుట్టల్లోకి దీక్షిత్‌ని తీసుకెళ్లి అతికిరాతకంగా గొంతు నులిమి చంపేశాడు. ఆపై ఆధారాలు దొరకకుండా ఉండేందుకు పెట్రోల్ పోసి శవాన్ని తగులబెట్టాడు. బాధిత కుటుంబానికి పరిచయం ఉన్న సాగర్ అనే యువకుడే.. ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు గుర్తించారు. మహబూబాబాద్‌కు సమీపంలోని శనిగపురం గ్రామానికి చెందిన నిందితుడు.. తొలుత ఆటోమొబైల్ దుకాణంలో పనిచేసేవాడు.
Death Sentence to Deekshith Murder Case Accused Sagar : ఆతర్వాత ఇసుక కూలీగా రంజిత్ దగ్గర.. సాగర్ (Sagar) పనికికుదిరాడు. ఈక్రమంలో నిందితుడు మహబూబాబాద్‌కి మకాం మార్చాడు. 2020 అక్టోబర్ 18న సాయంత్రం వేళ దీక్షిత్‌ను.. సాగర్ బైక్‌పై చాక్లెట్ కొనిస్తానంటూ తీసుకెళ్లాడు. సమీపంలోని దానవాయి గుట్టలపైకి బాబును తీసుకెళ్లాడు. బాలుడు ఏడుపుతో భయపడిన నిందితుడు కిడ్నాప్ బయటపడుతుందోనని.. చిన్నారికి నిద్రమాత్రలు ఇచ్చాడు. మత్తులో ఉండగానే చేతిరుమాలుతో చేతులు కట్టి దీక్షిత్ టీషర్టుతోనే మెడకు ఉరి బిగించి హత్య చేశాడు.
'దీక్షిత్‌రెడ్డి హంతకుడి మనస్తత్వం విచిత్రంగా ఉంటుంది'
దీక్షిత్‌ను చంపిన తర్వాత చరవాణి నంబరు తెలవకుండా నిందితుడు సాగర్.. యాప్‌ల ద్వారా తల్లిదండ్రులకు ఫోన్‌చేసి డబ్బు డిమాండ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. రంజిత్ ఫిర్యాదుతో పోలీసులు అన్ని కోణాల్లో విచారించారు. సాగర్.. రంజిత్ ఇంట్లోనే తిరుగుతూ.. కుటుంబసభ్యులు, పోలీసులు కదలికలను నిశితంగా గమనించినట్లు దర్యాప్తులో తేలింది. కిడ్నాపర్‌కి డబ్బులిచ్చేందుకు కన్నవారు సిద్ధపడ్డారు.
దీక్షిత్ హత్యకు కారణమేంటి... అసలేం జరిగిందంటే?
చెప్పిన స్థలానికి వారు సొమ్ము, బంగారం తీసుకెళ్లగా పోలీసుల నిఘా ఉందని.. సాగర్ అక్కడి నుంచి జారుకున్నట్లు జిల్లా ఎస్పీ చంద్రమోహన్ తెలిపారు. మూడురోజుల తర్వాత పక్కా సాంకేతిక ఆధారాలతో సాగర్ కిడ్నాపర్‌గా తేల్చి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ వివరించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం నిందితుడికి మరణశిక్ష (Death Sentence)విధిస్తూ.. మహబూబాబాద్ జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది.
"దీక్షిత్‌రెడ్డిని కిడ్నాప్ చేశారు. గొంతునులిమి హత్య చేశారు. అనంతరం పెట్రోల్‌పోసి బాలుడి శరీరాన్ని తగులబెట్టారు. అయినా డబ్బు కావాలని తల్లిదండ్రులను అడిగారు. ఈ కేసుకు సంబంధించిన పక్కా ఆధారాలతో కోర్టుకు సమర్పించాం. ఈరోజు కోర్టు నిందితుడికి మరణశిక్ష విధించడం జరిగింది." - చంద్ర మోహన్, మహబూబాబాద్ ఎస్పీ
మహబూబాబాద్ జిల్లా న్యాయమూర్తి తీర్పుపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. కన్నవారికి కడుపుకోత మిగిల్చిన కిరాతకుడికి సరైన శిక్ష విధించారని అభిప్రాయపడ్డారు. మూడేళ్ల తర్వాత తమకు బిడ్డను దూరం చేసిన నిందితుడికి శిక్షపడేలా కృషిచేసిన పోలీసులు, న్యాయవ్యవస్థ కృషిని కీర్తిస్తూ.. బాధిత కటుంబం పాలాభిషేకం చేసింది. బాణసంచా కాల్చుతూ.. ఆనందం వ్యక్తం చేశారు.
"మంద సాగర్ అనే వ్యకి.. నా కుమారుడిని దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో మహబూబాద్ కోర్టు నిందితుడికి మరణశిక్ష విధించారు. అందుకు మాకు సంతోషంగా ఉంది." - రంజిత్ రెడ్డి, దీక్షిత్‌రెడ్డి తండ్రి
ఐదేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి అత్యాచారం.. 77 రోజుల్లో నిందితుడికి ఉరిశిక్ష!