ETV Bharat / state

'ఏడేళ్లు పూర్తవుతున్నా ఉద్యోగ నియామకాలు లేవు'

రాష్ట్రంలో తెరాస అధికారం చేపట్టి ఏడు సంవత్సరాలు పూర్తవుతున్నా ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని... మహబూబాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ నాయకుడు స్వామి ఆరోపించారు. అందువల్లే నిరుద్యోగులు నిరాశ, నిస్పృహలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు.

Mahabubabad District Congress leaders Consultation the family members of suicide student Sunil, Mahabubabad District latest news
మహబూబాబాద్‌లో మృతి చెందిన విద్యార్థి సునీల్‌ కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా కాంగ్రెస్‌ నేతలు,
author img

By

Published : Apr 2, 2021, 5:32 PM IST

తెరాస అధికారం చేపట్టి ఏడు సంవత్సరాలు పూర్తవుతున్నా ఉద్యోగ నియామకాలు చేపట్టనందునే, నిరుద్యోగులు బలవన్మరణానికి పాల్పడుతున్నారని... మహబూబాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ నాయకుడు స్వామి ఆరోపించారు. జిల్లాలోని గూడూరు మండలం తేజావత్ రాంసింగ్ తండాలో ఆత్మహత్య చేసుకున్న బోడ సునీల్ కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్నారు. మృతి చెందిన సునీల్ కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం గూడూరు క్రాస్ రోడ్ వద్ద రాస్తారోకో చేపట్టి... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇదీ చదవండి: ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా భాజపా నాయకుల ధర్నా.. అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.