మహబూబాబాద్ జిల్లాలో ఫ్రంట్లైన్ వర్కర్స్కు వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోందని కలెక్టర్ గౌతమ్ తెలిపారు. ఇప్పటి వరకు 10 వేల మందికి వ్యాక్సిన్ ఇచ్చామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ గౌతమ్ కొవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకున్నారు.
ఫ్రంట్లైన్ వర్కర్స్కు వ్యాక్సిన్ ఇచ్చాక 50ఏళ్లు పైబడిన సామాన్య ప్రజలకు అందిస్తామని గౌతమ్ పేర్కొన్నారు. కొవిడ్ తగ్గిందని ప్రజలు అశ్రద్ధ చేయవద్దని సూచించారు. బయటకు వెళ్లే సమయంలో ప్రజలంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కోరారు.
ఇదీ చదవండి: 'వాణీదేవిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటేనే పీవీకి సరైన గౌరవం'