ETV Bharat / state

'నగదు అవసరం ఉన్నవారే బ్యాంకులకు రండి'

నిర్మల్​ జిల్లాలో కరోనా పాజిటివ్​ వచ్చిన వారితో కలిసి ప్రయాణించిన మహబూబాబాద్​ జిల్లా వాసులకు కరోనా నెగిటివ్​గా నిర్ధరణ అయిందని కలెక్టర్​ గౌతం తెలిపారు. నగదు అవసరం ఉన్నవారే బ్యాంకుల వద్దకు రావాలని ప్రజలను కోరారు. లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 79 మందిపై కేసులు నమోదు చేశామని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.

author img

By

Published : Apr 18, 2020, 11:12 AM IST

mahabubabad collector and sp on lockdown
'నగదు అవసరం ఉన్నవారే బ్యాంకులకు రండి'

నిర్మల్ జిల్లాలో పాజిటివ్ వచ్చిన వ్యక్తులతో కలిసి విమానంలో ప్రయాణించిన మహబూబాబాద్ జిల్లాకు చెందిన పది మందికి కరోనా నెగిటివ్​గా నిర్ధరణ అయిందని కలెక్టర్ వీపీ గౌతం తెలిపారు. నగదు అవసరం ఉన్నవారే బ్యాంకుల వద్దకు రావాలని ప్రజలను కలెక్టర్​ కోరారు. బ్యాంకుల ఎదుట గుమిగూడడం లాక్​డౌన్​ నిబంధనలను ఉల్లంఘించడమేనన్నారు. గ్రామాల్లో కూలీలు ఇబ్బందిపడకుండా ఉపాధి హామీ పథకం పనులను ప్రారంభించామని తెలిపారు. జిల్లాలో 18వేల మందికి ఉపాధి కల్పిస్తున్నామన్నారు. భౌతిక దూరం పాటించాలని కూలీలకు సూచించారు.

జిల్లా లోపల ఐదు చెక్​పోస్ట్​లు, సరిహద్దుల్లో మరో ఐదు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. సరిహద్దు జిల్లాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నందుకు మరికొన్ని చెక్​పోస్టులు ఏర్పాటుచేస్తున్నట్లు వెల్లడించారు. లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 79 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. 5,355 వాహనాలను సీజ్ చేశామని పేర్కొన్నారు.

ఇవీచూడండి: ఒకే కుటుంబంలో 31 కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.