మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల బరిలో తెరాస నుంచి మాలోత్ కవిత, కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్, భాజపా నుంచి హుస్సేన్ నాయక్‌లు నిలిచారు. కేసీఆర్ సంక్షేమ పథకాలు, ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు తెరాస తీర్థం పుచ్చుకోవడం మాలోత్ కవితకు సానూకూలాంశాలు. గతంలో చేసిన అభివృద్ధి పనులు, బలమైన పార్టీ శ్రేణులు కలిగి ఉండటం బలరాం నాయక్‌కు సానుకూల అంశాలు. మోదీ ఛరిష్మా, యువనేత కావడం హుస్సేన్ నాయక్‌ను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి: వైద్యుని నిర్లక్ష్యం.. చికిత్స అందక బాలుడి మరణం