మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఉల్లేపల్లిలోని ఈనెల 17న అనుమానాస్పదంగా మృతి చెందిన మహిళ కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు వివాహేతర సంబంధాలే కారణమని పోలీసులు నిర్ధరించారు. ఈనెల 17న నిందితుడు హుస్సేన్ లునావత్ తండాకు రమ్మని చెప్పి మహిళ తలపై బండరాయితో కొట్టి గాయపరిచాడని పోలీసులు తెలిపారు. అనంతరం కొనఊపిరితో ఉన్న మహిళ మెడకు చున్మి బిగించి హతమార్చినట్లు వెల్లడించారు. నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తొర్రూరు డీఎస్పీ మదన్‌లాల్ తెలిపారు.
ఇవీ చూడండి: కల్యాణ లక్ష్మీ సొమ్ము కోసం భార్యను తగలబెట్టాడు