Lorry fire in mahbubabad: మహబూబాబాద్ జిల్లా మరిపెడలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఎరువుల లోడుతో ఉన్న లారీ కరెంట్ తీగలు తగిలి దగ్ధమైంది. లారీలో 15 టన్నుల జిప్సం ఉంది. ఓ దుకాణం వద్ద 15 టన్నుల జిప్సం లోడు దించి లారీని రివర్స్ చేసే క్రమంలో వరంగల్, ఖమ్మం రహదారి పైనుంచి వెళ్లే 11కే విద్యుత్ తీగలు లారీకి తగిలాయి.
దీంతో ఒక్కసారిగా పెద్ద మంటలు చెలరేగి లారీని చుట్టుముట్టడంతో అందులో ఉన్న 15 టన్నుల జిప్సం దగ్ధమై భారీగా నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు.
ఇవీ చదవండి: