గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లిలో శానిటేషన్ పనులను పరిశీలించారు. అనంతరం గూడూరు మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను సందర్శించి కరోనా వైరస్ నివారణకు తీసుకుంటున్న చర్యల గురించి వైద్యులను అడిగి తెలులుకున్నారు. అవసరం ఉంటేనే రోడ్లపైకి రావాలని, లేనిపక్షంలో ఇంటివద్దనే ఉండాలని విజ్ఞప్తి చేశారు.
పట్టణంలోని పలు వీధులలో తిరుగుతూ లాక్‌డౌన్ పరిస్థితిని జిల్లా ఏఎస్పీ ప్రభాకర్ సమీక్షించారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి రహదారులపై తిరుగుతున్న ద్విచక్ర వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారితో చెవులు పట్టి గుంజీలు తీయించారు.
ఇవీ చూడండి: ఒక్క రోజే పది మందికి కరోనా పాజిటివ్..జాగ్రత్త సుమా..!