హైదరాబాద్‌లోని ఆసుపత్రికి కుటుంబ సభ్యులతో కలిసి రైలులో వెళ్తుండగా లిప్లీ ఆనంద్ సేనాపతి (45)గుండెపోటుతో మృతి చెందాడు. విశాఖపట్నం నుంచి ముంబయికి వెళ్తున్న ఎల్టీటీ(లోకమాన్య తిలక్ టెర్మినల్)రైలులో ప్రయాణం చేస్తున్న లిప్లీ రైలు డోర్నకల్ రైల్వేస్టేషన్‌కు చేరుకోగానే గుండెపోటు సంభవించి అక్కడికక్కడే మృతి చెందాడు.
దీంతో వెంటనే రైలును ఆపి మృతదేహాన్ని దించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు ఒడిశా రాష్ట్రం భరంపురం నివాసి.
ఇదీ చూడండి : ఒకప్పటి సర్పంచ్... ఇప్పుడు దొంగగా ఎందుకు మారాడు?