మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర మూఠాకు చెందిన నలుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 20 గ్రాముల బంగారం, ఒక ద్విచక్ర వాహనం, రెండు సెల్ ఫోన్లు, ఒక ట్యాబ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు మహబూబాబాద్ టౌన్ ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు.
మధ్యప్రదేశ్‌లోని విదిశ ప్రాంతానికి చెందిన జాటప్ రాజ్ కుమార్, శుభం నాయక్, అభిలాష్ విశ్వకర్మ, శుభం విశ్వకర్మలు ఒక ముఠాగా ఏర్పడి మధ్యప్రదేశ్ నుంచి రాష్ట్రానికి వచ్చారు. రైల్వేస్టేషన్లకు సమీప ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను దొంగిలించి, వాటిపై ప్రయాణం చేస్తూ ఒంటరిగా ఉన్న మహిళల మెడల్లో గొలుసులను దోచుకుపోతున్నారు. సీసీ కెమెరాలో ఆనవాళ్లను బట్టి ఆ ముఠాను సీసీఎస్ పోలీసులు మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకున్నారు.
మరో అంతర్ జిల్లా నేరస్థుడు కురవి మండలం బలపాల శివారు లింగ్యా తండాకు చెందిన మాలోత్ రూప్ లాల్, వ్యసనాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతూ, జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు. తర్వాత మళ్లీ దొంగతనాలకు పాల్పపడుతున్నాడు. వేలి ముద్రల ఆధారంగా అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాలను ఒప్పుకున్నాడు. ఇతనిపై పీడీ యాక్ట్‌ను నమోదు చేయనున్నట్లు ఎస్పీ తెలిపారు.
ఇదీ చూడండి : 'తెలంగాణలో ఎందుకు పుట్టానురా అనిపిస్తోంది'