ETV Bharat / state

మహబూబాద్​లో గంజాయి ముఠా అరెస్టు - Inter-State gang arrested, marijuana seized in Mahabobabad

మహబూబాబాద్ జిల్లాలో అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ‌ డీఎస్పీ నరేశ్‌కుమార్‌ తెలిపారు. గంజాయిని నర్సంపేట పట్టణంలో అమ్మేందుకు వెళుతుండగా భూపతిపేట అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద శిక్షణ ఐపీఎస్‌ అధికారి యోగేశ్‌ గౌతమ్‌, గూడూరు ఎస్సై యాసిన్‌ పట్టుకున్నారు.

Inter-State gang arrested, marijuana seized in Mahabobabad
మహబూబాద్ లో గంజాయి ముఠా అరెస్టు
author img

By

Published : May 12, 2020, 12:12 PM IST

ఎనిమిది మందితో కూడిన అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు మహబూబాబాద్‌ డీఎస్పీ నరేశ్‌కుమార్‌ తెలిపారు. . మహబూబాబాద్‌కు చెందిన పెండ్యాల మనోహర్‌, రేబెల్లి సాయిరాం, కురవి మండలం చింతపల్లికి చెందిన ఆడెం గోపి కిలో గంజాయిని నర్సంపేట పట్టణంలో అమ్మేందుకు వెళుతుండగా ఆదివారం సాయంత్రం గూడూరు మండలం భూపతిపేట అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద శిక్షణ ఐపీఎస్‌ అధికారి యోగేశ్‌ గౌతమ్‌, గూడూరు ఎస్సై యాసిన్‌ పట్టుకున్నారు. వీరిని విచారించగా వరంగల్‌, హన్మకొండ ప్రాంతాల్లో యువతకు గంజాయి అమ్ముతున్నట్లు విచారణలో తేలిందన్నారు.

నిందితుల నుంచి రూ.40వేలు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకుని నాలుగు కిలోల గంజాయిని తహసీల్దార్‌ చంద్రశేఖర్‌రెడ్డి సమక్షంలో పంచనామా నిర్వహించారు. ఈ కేసులో ఈ ముగ్గురితో పాటు కురవి మండలం గుజిలితండాకు చెందిన‌ తుల్సియా, గుగులోత్‌ హచ్యా, బాబురావు, బానోత్‌ చీన్యాలను అరెస్టు చేశారు.

ఇదీ చూడండి: నర్సులు తెల్లబట్టల్లో ఉన్న దేవతలు: గవర్నర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.