మహబూబాబాద్‌లో స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. పట్టణంలోని 36 వార్డులకు గానూ... ఒకటి ఏకగ్రీవమైంది. 35 స్థానాలకు పోలింగ్ జరగనుంది. తెరాస నుంచి ఆశావహులు ఎక్కువగా ఉండటం వల్ల టికెట్ రాని వారు స్వతంత్రులుగా బరిలో నిలిచారు. 9 వార్డుల్లో అధికార పార్టీ అభ్యర్థులకు స్వతంత్రులతో ఇబ్బందిగా మారారు.
స్వతంత్ర అభ్యర్థులుగా... బానోత్ రవి 8వ వార్డు, బానోత్ హరిసింగ్ 9వ వార్డు, శోభారాణి 11వ వార్డు, గోనె శ్యామ్ 12వ వార్డు, చెట్ల జయశ్రీ 13వ వార్డు, 27వ వార్డు డోలి సాయికిరణ్, 31వ వార్డు దాసరి అర్షిక, 32వ వార్డు పంజాల నర్సమ్మ, 33వ వార్డు వేముల మీనాకుమారి బరిలో నిలిచారు. తమకు కేటాయించిన గుర్తులతో... చాప కింద నీరులా ప్రచారం నిర్వహిస్తున్నారు. 6 నుంచి 7 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్నట్లు స్థానికులు చెప్పుకుంటున్నారు.
ఇవీ చూడండి: మంత్రి ఎర్రబెల్లిపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు