మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గుర్తురు రామసముద్రం చెరువు మత్తడి పోస్తుడడం వల్ల తొర్రూరు నర్సంపేట మధ్య వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. జిల్లా మత్స్యశాఖ అధికారి ఆంజనేయస్వామి, గ్రామ సర్పంచి రవీంద్రచారి అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆకేరువాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దానితో పరిసర ప్రాంత పంట పొలాలు మొత్తం నీటిలో మునిగిపోయాయి.
ఇదీ చూడండి: గుడారాల్లో పెరిగింది... నాయకత్వ పాఠాలు చెబుతోంది!