మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దొరవారి తిమ్మాపురం గ్రామంలో ప్రాణాలకు తెగించి భర్త... భార్యను రక్షించాడు. సుభద్ర అనే మహిళ సోమవారం ఉదయం మొక్కజొన్న చేను వద్దకు కాపలాగా వెళ్లారు. తాను వెళ్లేటపుడు వాగు ఉద్ధృతి తక్కువగానే ఉంది. సాయంత్రం ఇంటికి తిరుగు పయనమయ్యారు.
ఇలోగా వాగు ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగిపోయింది. అవతలి ఒడ్డుకు చేరుకోలేక చిక్కుకుపోయింది. విషయం తెలిసిన భర్త విజయ్.. భార్యను ఎలాగైనా తీసుకురావాలని గ్రామస్థుల సహకారం కోరాడు. వాగుకు రెండు ఒడ్డులకు మధ్య ఒక తాడు కట్టారు. ప్రమాదకరంగా ఉన్న వాగును ఈదుతూ విజయ్ అవతలి ఒడ్డుకు చేరాడు.
భార్యను తాడు సాయంతో క్షేమంగా ఇవుతలికి ఒడ్డుకు చేర్చాడు. భార్యను క్షేమంగా తీసుకొచ్చిన భర్త విజయ్‌ను గ్రామస్థులు అభినందించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వాగుపై వంతెనను నిర్మించాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: Gandhi Hospital Rape: 'గాంధీ'లో అక్కాచెల్లెళ్లపై అత్యాచారం... పోలీసుల అదుపులో నలుగురు