మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గుర్తూరులో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆకేరు వాగు ఉప్పొంగుతోంది. రెండు రోజులుగా కురిస్తున్న వర్షాలకు ఆకేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఆకేరు వాగును చూడడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తుండడం వల్ల వాగులోకి వెళ్లకుండా రెవెన్యూ అధికారులు హెచ్చరిక ప్లకార్డులను పెట్టారు.
మరో మూడు రోజులు భారీ వర్షాలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఆకేరు వాగు వద్ద భద్రతను ఏర్పాటు చేస్తామని గ్రామ సర్పంచ్ మోత్కూరి రవీంద్రాచారి తెలిపారు. మినీ బొగత జలపాతం వలె ఉండడం వల్ల వేరే గ్రామాల నుంచి వస్తున్న పర్యటకులకు జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఆకేరు వాగు ఉద్ధృతి తగ్గేవరకు ఎవరు లోపలికి వెళ్లకూడదని గ్రామ సర్పంచ్ తెలిపారు.
ఇవీ చూడండి: రెండ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు