మహబూబాబాద్ జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షానికి మున్నేరు, పాకాల వాగులు అలుగు పారుతున్నాయి, చెరువులన్నీ మత్తడి పోస్తున్నాయి కల్వర్టులపై నుంచి నీరు ప్రవహించడం వల్ల నెల్లికుదురు మండలం చిన్న నాగారం, ఇనుగుర్తి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ వరద ప్రవాహంలో రెండు పశువులు కొట్టుకుపోయాయి.
గూడూరు మండల కేంద్రం నుంచి కమల్తండాకు ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తి ప్రవాహ ధాటికి నీటిలో పడిపోయాడు. కేసముద్రం మండలం పెసరబండ పాఠశాల ఆవరణ మొత్తం నీటితో నిండిపోయి చెరువును తలపించింది. జిల్లాలోని పలు గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగాయి. ఈ వర్షాలకు పత్తి, వరి పంటలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- ఇవీ చూడండి: వైద్యారోగ్య శాఖలో ఖాళీలను భర్తీ చేయండి: భట్టి