మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం వెన్నారానికి చెందిన రామ్మూర్తి అనే రైతు రెండు ఆవులతో వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగించేవాడు. ఈనెల 21న పిడుగుపాటుతో రెండు ఆవులు మృత్యువాత పడ్డాయి. కన్నబిడ్డలా చూసుకుంటున్న గోవులు చనిపోవటంతో శోకసంద్రంలో మునిగిపోయిన రైతు ఆవేదనను ప్రచురించిన ఈటీవీ భారత్ కథనానికి స్పందన లభించింది. నందీశ్వర సేవా సమితి ఛైర్మన్ ఆశీష్ గౌడ్ స్పందించి బీరంగూడ గోశాల నుంచి 2 ఆవులు, ఒక లేగను రామ్మూర్తికి అందించారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న... ఏడవటం బాధకలిగించిందని ఆశీష్ తెలిపారు. రామ్మూర్తి ముఖంలో ఆనందం చూసేందుకు ఈ చిన్న సాయం చేశామన్నారు.
ఇవీ చూడండి: భవనాల కూల్చివేతకు హెచ్‌ఎండీఏ అనుమతి ఉందా?