రైతు అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. రైతుల సంక్షేమానికి పాటుపడుతోందని పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మొగిలిచర్లలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
రైతులు నష్టపోకుండా మద్దతు ధరతో ధాన్యాన్ని నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ధాన్యాన్ని ఆరబెట్టుకుని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని అన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో మళ్లీ విజృంభిస్తోన్న చలి