ETV Bharat / state

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే రెడ్యానాయక్

మహబూబాబాద్ జిల్లాలోని కురవి మండల పరిధిలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే రెడ్యా నాయక్ పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ ప్రతి గింజను కొంటామని స్పష్టం చేశారు.

ప్రతి గింజ కొంటాం...ప్రభుత్వానికే విక్రయించండి : ఎమ్మెల్యే

author img

By

Published : May 6, 2020, 8:33 PM IST

మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలంలోని అయ్యగారిపల్లి, గుండ్రాతిమడుగు, తాళ్ల సంకీస, రాజోలు గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను డోర్నకల్‌ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ పరిశీలించారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని ఆయన కోరారు.

ప్రభుత్వానికి అమ్మండి... మద్దతు ధర పొందండి

గుండ్రాతిమడుగు వద్ద రైల్వే గేటు పడి ఉండటం వల్ల కొనుగోలు కేంద్రానికి ఎమ్మెల్యే సహా ఇతర నేతలు ట్రాక్‌పై నుంచి నడిచివెళ్లారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులు ఎవరూ అదైర్యపడొద్దని ఎమ్మెల్యే సూచించారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరను పొందాలన్నారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : సీఎంకు కృతజ్ఞతలు చెబుతూ మందుబాబు ఆనందం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.