మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో వారం రోజులుగా కురిసిన వర్షాలకు వాగులు, చెరువులు నిండుకుండలా మారాయి. రహదారులన్నీ జలమయమయ్యాయి.
భారీ వర్షాల వల్ల దంతాలపల్లి మండలం పెద్దముప్పారంపల్లి శివారులోని పాలేరు వాగు, నర్సింహులపేట మండలం కౌసల్యాదేవిపల్లి శివారులోని ఆకేరు వాగుకు వరద పోటెత్తింది. ఫలితంగా ఆ వాగులపై ఉన్న వంతెనల పైనుంచి వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. ఆ మార్గాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
నియోజకవర్గంలోని చెరువులు, వాగులు మత్తడి పోస్తూ ఆహ్లాదకరంగా కనువిందు చేస్తున్నాయి. వాగుల వద్ద ప్రమాదాలు చోటు చేసుకోకుండా అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు.