ETV Bharat / state

కష్టాన్నే ఇష్టపడింది... దేశంలోనే కీర్తి గడించింది! - మహిళా లైన్​మెన్​ భారతి కథనం

కరెంటు స్తంభం ఎక్కడం అనుకున్నంత సులభం కాదు. పురుషులే సాహసకృత్యంగా భావించే ఈ విధులు... మహిళలు నిర్వర్తించటం కత్తిమీద సామే. కానీ, అలాంటి పరీక్షలో అలవోకగా నెగ్గిన అతివగా నిలిచింది మహబూబాబాద్‌కు చెందిన మహిళ. ఆటంకాలను ఎదురొడ్డి... అనుకున్నది సాధించి... భారత్‌లోనే తొలి లైన్‌ ఉమెన్‌గా రికార్డు సృష్టించింది... భారతి.

కష్టాన్నే ఇష్టపడింది... దేశంలోనే కీర్తి గడించింది!

author img

By

Published : Jan 24, 2021, 1:27 PM IST

Updated : Jan 25, 2021, 4:58 PM IST

కష్టాన్నే ఇష్టపడింది... దేశంలోనే కీర్తి గడించింది!

చెట్టు లెక్కగలనే... ఓ చెంచిత పుట్టలెక్కగలనే... అంటూ నాటి సినిమాలో ఓ కథనాయిక అడిగిన ప్రశ్నకు... తడుముకోకుండా సమాధానం చెపుతాడు కథానాయకుడు. అప్పట్లో చిత్రానికే హైలెట్‌గా నిలిచిన ఈ పాటకు... దశాబ్దాలు గడిచినా అదేస్థాయిలో ఆదరణ ఉంటుంది. అదే ప్రశ్న... ఈ నారీమణిని అడిగితే... చెట్లేంటి.. ఏకంగా కరెంటు స్తంభాలే... సునాయాసంగా ఎక్కగలనంటోంది. క్షణాల్లోనే స్తంభాన్ని ఎక్కి దిగుతూ... పురుషులతో పోల్చితే తానేం తక్కువ కానంటోంది భారతి.

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం బోజ్యాతండా గ్రామ పంచాయితీలోని దేశ్యాతండాకు చెందిన వాంకుడోతు భారతి దేశంలోనే తొలి జూనియర్ లైన్​మెన్​గా ఎంపికై రికార్డు నెలకొల్పింది. భారతి పుట్టి పెరిగింది జనగామ జిల్లా కొడకండ్ల మండలం మెండ్రాయ్ గ్రామం సుతారిగడ్డ తండా. సాధారణ వ్యవసాయ కుటుంబం కావడం వల్ల చిన్ననాటి నుంచి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు.. పనులు చేసుకుంటూనే పై చదువులు చదివింది. కాకతీయ వర్శిటీ నుంచి ఎంకాం పట్టా పొందింది. 2012లో పెళ్లి కాగా... ఆ తరువాత... ఇంటి పని, పిల్లల చదువులతో క్షణం తీరిక లేకున్నా పట్టుదలతో... 2016లో ఐటీఐ ఎలక్ట్రీషియన్ కోర్సు పూర్తి చేసింది. స్త్రీలకు పోటీ తక్కువుగా ఉంటుందని....ఈ కోర్సును ఎంచుకుంది.

ఎన్నో అడ్డంకులకు ఎదురొడ్డి

లైన్​మెన్​గా ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకున్న భారతికి అనేక కష్టాలు తప్పలేదు. చివరకి కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకుని పరీక్ష రాసి.. అర్హత సాధించారు. పోల్ టెస్ట్ కోసమూ కోర్టు చుట్టూ పలుమార్లు తిరిగారు. చివరకు గతేడాది డిసెంబర్ 23 భారతి పోల్​టెస్ట్​కు అర్హత సాధించింది. ఎట్టకేలకు ఉద్యోగానికి అర్హత సాధించడంతో... భారతి ఆనందానికి అవధులు లేవు. భర్త, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో...ఇది సాధించానని చెపుతున్నారు. లాక్ డౌన్ కారణంగా పోల్ టెస్ట్ జరగడంలోనూ ఆలస్యమైందని.. మొత్తానికి కష్టానికి తగ్గ ఫలితం లభించిందని....భారతి భర్త చెపుతున్నారు.

పోల్​ భారతిగా..

మహిళలని చిన్నచూపు చూడడం, వారికి ఏం చేతకాదు.. చేయలేరు అనుకోవడం సరికాదని భారతి చెపుతున్నారు. అవకాశం ఇవ్వాలే కానీ దూసుకుపోయే తత్వం మహిలదని అంటున్నారు. పోల్ టెస్ట్ సాధించాక... భారతి పేరు పోల్ భారతిగా మారిపోయింది. విద్యుత్ స్తంభాలు...ఎక్కుతానని చెప్పినవ్పుడు తేలికగా చూసినవారంతా...ఇప్పుడు భారతిని ప్రత్యేకించి అభినందిస్తున్నారు.

నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తా

ఆడవాళ్లు కరెంట్‌ స్తంభాలు ఎక్కి మరమ్మతులు చేయగలుగుతారా అన్న వాదనకు భిన్నంగా జూనియర్‌ లైన్‌ విమెన్‌గా నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తా. ఆడవాళ్లు ఏ రంగంలో తక్కువ కాదని నిరూపిస్తాను. నా భర్త మోహన్‌సింగ్‌ ఇచ్చిన ధైర్యం, చిన్నప్పటి నుంచి తండాలో రోజు చేసిన కష్టం గుండె నిబ్బరాన్ని పెంచింది. చిన్నతనంనుంచి సాగు పనులు చేసిన కష్టం ముందు లైన్‌విమెన్‌గా చేయబోయే కష్టం పెద్దదేమీ కాదు. - భారతి, లైన్​విమెన్​.

ఇదీ చూడండి: జూనియర్​ పంచాయతీ కార్యదర్శులకు శుభవార్త!

Last Updated : Jan 25, 2021, 4:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.