కారులో వెళ్తున్న వారికి మాస్క్లేదని జరిమానా విధించడాన్ని నిరసిస్తూ ఓ మహిళ రోడ్డుపైనే బైఠాయించింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కురవిలో జరిగింది. వాహనంలో వెళ్తున్న వారికి జరిమానా ఎలా విధిస్తారంటూ కారులోని వారు నిరసన తెలిపారు. రోడ్డుపై వాగ్వివాదానికి దిగడంతో వాహనాలు నిలిచిపోయి రాకపోకలు స్తంభించాయి.
మాస్క్ ధరించని వారికి వెయ్యి రూపాయలు జరిమానా విధించాలన్న కలెక్టర్ ఆదేశాలతో చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. గంట తర్వాత రూ.500 జరిమానా చెల్లించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇవీచూడండి: మాస్క్ ధరించనని మొండిపట్టు.. చివరకు అరెస్టు