ETV Bharat / state

కన్న కొడుకును కాలరాసిన తండ్రి

author img

By

Published : Dec 29, 2019, 3:47 PM IST

కన్న కొడుకుని ఓ కసాయి తండ్రి హత్య చేశాడు. మెడకు విద్యుత్ తీగను బిగించి హతమార్చాడు. కుమారుడు తనకు తానే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తన ప్రియురాలితో కలిసి పథకం ప్రకారం అందరిని నమ్మించారు.. కానీ తల్లి అనుమానంతో  చివరకు కటకటాల పాలయ్యారు.

father-killed-his-son-in-mahaboobabad
కన్న కొడుకును కాలరాసిన తండ్రి

మహబూబాద్ జిల్లా డోర్నకల్ మండలం అమ్మపాలెం గ్రామానికి చెందిన నెమలి అశోక్ అనే యువకుడు తరచూ తన తండ్రి నెమలి వెంకటేశ్వర్లుతో గొడవ పడుతూ ఉండేవాడు. దీనితో విస్తుచెందిన అతను కొడుకును ఎలాగైనా హతమార్చేందుకు పథకం రచించాడు. ఈనెల 21వ తేదీ రాత్రి సమయంలో మద్యం సేవించి వచ్చి నిద్రలోకి జారుకున్న అశోక్​పై హత్య ప్రయత్నం చేశాడు.

నిద్రమత్తులో ఉన్న అశోక్ మెడకు విద్యుత్ సర్వీసు తీగ చుట్టి హత్య చేశాడు. ఈ విషయాన్ని తన ప్రియురాలైన బానోతు అమ్మికి చెప్పి.. ఇద్దరు కలిసి ఘటనా స్థలానికి వెళ్లారు. అశోక్ స్వయంగా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రజలను నమ్మించేందుకు ఫ్యానుకు చీర కట్టి అశోక్​ను ఉరివేశారు. ఏమీ ఎరుగనట్టు ఈ విషయాన్ని గ్రామస్థులకు చెప్పి లబోదిబోమని రోదించారు.
అశోక్ మృతిపట్ల అనుమానం వ్యక్తం చేస్తూ మృతుడి తల్లి నెమలి చుక్కమ్మ ఈ నెల 22న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనితో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి తమదైన శైలిలో విచారణ చేపట్టగా వెంకటేశ్వర్లే తన కొడుకును హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. అతడికి ఉరి వేసేందుకు సహకరించిన అమ్మితో పాటు వెంకటేశ్వర్లును అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ శ్యాంసుందర్ తెలిపారు.

కన్న కొడుకును కాలరాసిన తండ్రి

ఇవీ చూడండి: దశాబ్ది సవాల్​: మలి సంధ్యకు ఊతకర్ర అవుదాం

Intro:TG_WGL_26_28_IDDARI_ARREST_VO_TS10114
.......... ....... ......
జె. వెంకటేశ్వర్లు... డోర్నకల్...8008574820
........ ..... ....
కన్న కుమారుడిని ఓ కసాయి తండ్రి హత్య చేశాడు. మెడకు విద్యుత్ సర్వీసు తీగను బిగించి హతమార్చాడు. కుమారుడు తనకు తానే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తన ప్రియురాలితో కలిసి చీరతో ఉరి వేసి ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నించారు. చివరకు పోలీసుల విచారణలో తండ్రే హత్య చేసినట్లు తెలడంతో నిందితులు కటకటాల పాలయ్యారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది....
() మహబూబాద్ జిల్లా డోర్నకల్ మండలం అమ్మపాలెం గ్రామానికి చెందిన నెమలి అశోక్ (26)అనే యువకుడు తరచూ తన తండ్రి అయిన నెమలి వెంకటేశ్వర్లుతో గొడవ పడుతూ ఉండేవాడు. దీంతో కొడుకును ఎలాగైనాహత మార్చేందుకు తండ్రి వెంకటేశ్వర్లు పథకం రచించాడు. ఈనెల 21న రాత్రి మద్యం సేవించి వచ్చి అశోక్ నిద్ర లోకి జారుకున్నాడు. ఇదే అదునుగా భావించిన వెంకటేశ్వర్లు తన కుమారుడైన అశోక్ ను హత్య చేసేందుకు ప్రయత్నించాడు. నిద్రమత్తులో ఉన్న అశోక్ మెడకు విద్యుత్ సర్వీసు తీగ చుట్టి హత్య చేశాడు .ఈ విషయాన్ని తన ప్రియురాలైన బానోతు అమ్మికిచెప్పాడు. వీరిద్దరు కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అశోక్ స్వయంగా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రజలను నమ్మించేందుకు ఫ్యానుకు చీర కట్టి అశోక్ కు ఉరి వేశారు .ఈ విషయాన్ని గ్రామస్తులకు చెప్పారు .అశోక్ మృతిపట్ల అనుమానం వ్యక్తం చేస్తూ మృతుడి తల్లి నెమలి చుక్కమ్మ ఈ నెల 22న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. తమదైన శైలిలో విచారణ చేపట్టగా వెంకటేశ్వర్లు తన కుమారుడు అశోక్ను తానే హత్య చేసుకున్న ఒప్పుకున్నాడు. అతడికి ఉరి వేసేందుకు సహకరించిన అమ్మితో పాటు వెంకటేశ్వర్లును అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు సిఐ శ్యాంసుందర్ తెలిపారు.
బైట్....
1. శ్యామ్ సుందర్ సి ఐ డోర్నకల్

Body:TG_WGL_26_28_IDDARI_ARREST_VO_TS10114

Conclusion:TG_WGL_26_28_IDDARI_ARREST_VO_TS10114
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.