మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం గున్నపల్లి, రేపోని గ్రామాలకు చెందిన పలువురు రైతులు బీపీటీ రకానికి చెందిన వరి విత్తనాలు 30 కిలోల బస్తా రూ.775 చొప్పున కొనుగోలు చేసి ఇటీవల నాటు వేశారు. రోజులు గడిచినా నారు పెరగకపోవటంతో పాటు వచ్చిన కొద్ది పాటి నారు కుళ్లిపోయిందని రైతులు ఆరోపించారు.
తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు దుకాణం వద్దకు చేరుకొని రైతులతో మాట్లాడారు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు.