ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంక్షేమ చర్యలు చేపట్టడాన్ని హర్షిస్తూ మహబూబాబాద్ జిల్లా ఆమనగల్, వేమునూరు గ్రామాల్లో చిత్రపటానికి రైతులు క్షీరాభిషేకం చేశారు. ధాన్యం, మెుక్కజొన్నల కొనుగోలు కేంద్రాల్లో రైతులంతా ఒక్కచోట చేరి కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసి నినాదాలు చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పథకం ప్రవేశపెట్టడమే గాక, రూ.25 వేల వరకూ బ్యాంకు రుణాలు మాఫీ చేశారని రైతులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కృషి వల్లే పంటలు సమృద్ధిగా పండుతున్నాయని, వానకాలం కన్నా యాసంగిలో అధిక దిగుబడి వచ్చిందని రైతులు తెలిపారు.
ఇవీ చూడండి: గోదావరి జలాల వినియోగంపై కొనసాగుతున్న సీఎం కేసీఆర్ సమీక్ష