తప్పుడు సమాచారం సృష్టించి ఫేస్బుక్లో పోస్టు చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ డీఎస్పీ వెంకటరమణ వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు పోలీస్ స్టేషన్ పరిధిలోని నరసింహులగూడేనికి చెందిన రాయరపు నాగరాజు కరోనాపై అసత్య ప్రచారం చేస్తున్నాడు. జిల్లాలో నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయని, అందరూ జాగ్రత్తగా ఉండి లాక్డౌన్కు మద్దతు తెలపాలంటూ ఈ నెల 23న ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఈ అంశంపై ఈనెల 25న నెల్లికుదురు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. విచారణ చేసిన పోలీసులు నాగరాజును అరెస్ట్ చేశారు.
ఇవీ చూడండి: ఆదిలాబాద్ జిల్లాలో 105 మంది విద్యార్థుల అడ్డగింత