మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వికాస్ డిగ్రీ కళాశాల విద్యార్థులతో ఈటీవీ భారత్.... ఈనాడు ఆధ్వర్యంలో ఓటర్ అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ నెల 22న జరిగే మున్సిపల్ ఎన్నికలలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, నేర చరిత్ర లేని వ్యక్తులను ఎన్నుకోవాలని ఓటర్లకు అవగాహన కల్పించారు.
పట్టణ ప్రాంతాలలో పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదవుతుందని, ఎన్నికల రోజు ఏ పనులు ఉన్నా ఓటర్లు అంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కళాశాల లెక్చరర్ జనార్దన్ కోరారు.
ఇదీ చూడండి : బస్తీమే సవాల్: పంచాయతీ కన్నా వెనుకబడ్డ జవహర్నగర్ కార్పొరేషన్