స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఫాతిమా హై స్కూల్లో ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తూనే, మరో వైపు బ్యాలెట్ పెట్టెల సీల్ తీసి గులాబీ, తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లను వేరు చేశారు. అనంతరం ఆ ఓట్లను లెక్కిస్తున్నారు. కలెక్టర్ శివలింగయ్య, ఎస్పీ కోటిరెడ్డిలు ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లెక్కింపు కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ విధించి, ఇతరులను లోనికి అనుమతించలేదు. మహబూబాబాద్ జిల్లాలో 16 జడ్పీటీసీలు,183 ఎంపీటీసీ స్థానాల ఓట్లను లెక్కిస్తున్నారు.
మహబూబాబాద్‌లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ - COUNTING
మహబూబాబాబాద్ జిల్లాలోని ఫాతిమా హై స్కూల్లో ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.