రైతు సంక్షేమమే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం పని చేస్తోందని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని పలు గ్రామాల్లో నూతనంగా నిర్మించిన రైతు వేదిక భవనాలను ప్రారంభించారు.
రైతులందరు రైతు వేదిక భవనాల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకుని సాగు విధి విధానాలు రూపొందించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. దీనివల్ల ఏ పంటలు వేస్తే దిగుబడి ఎక్కువ వస్తుందో తెలుస్తుందని చెప్పారు. వ్యవసాయ రంగంలో మార్పునకు నాంది పలికేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు వేదికలను ఏర్పాటు చేశారని తెలిపారు.
- ఇదీ చూడండి : 'కుల సంఘాలు ఐక్యంగా ఉండాలి'