ETV Bharat / state

ఈ ఘనత సీఎం కేసీఆర్​కే దక్కుతోంది: ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ - MLA Reddyanaik inaugurated the power substation

దేశంలోని ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టని అనేక సంక్షేమ పథకాలను కేసీఆర్​ ప్రవేశపెట్టారని డోర్నకల్‌ శాసన సభ్యుడు రెడ్యానాయక్‌ అన్నారు. రైతుల అభివృద్ధి కోసం 24 గంటల నాణ్యమైన విద్యుత్​ను అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

MLA Reddyanaik inaugurated the power substation
విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రెడ్యానాయక్
author img

By

Published : Apr 7, 2021, 1:16 PM IST

రైతే రాజు అన్నరీతిలో తెరాస పాలన కొనసాగుతోందని డోర్నకల్‌ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ అన్నారు. రైతు సంక్షేమం కోసం 24 గంటల విద్యుత్​ను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్​కు దక్కుతోందని తెలిపారు. మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలం పడమటిగూడెంలో కొత్తగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

రైతులకు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసేందుకు అదనంగా ఉపకేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుశీల, జడ్పీటీసీ సభ్యురాలు సంగీతతో పాటు విద్యుత్​శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: చెల్లిపై అత్యాచారానికి పాల్పడిన యువకుడు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.