మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కొండపల్లి, గోపాల్ రావు నగర్లో పిచ్చి కుక్కలు విచక్షణారహితంగా దాడి చేయటం వల్ల ఎనిమిది మంది పిల్లలకు గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన ఐదుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా... స్వల్ప గాయాలైన ముగ్గురికి ప్రథమ చికిత్స చేసి ఇంటికి పంపించారు. సీపీఐ నాయకుడు అజయ్ సారథి ఆస్పత్రికి వెళ్లి గాయపడ్డ వారిని పరామర్శించారు. పట్టణంలో కుక్కలు, కోతుల బెడద ఎక్కువగా ఉందని వాటిని నివారించాల్సిందిగా ప్రజలు, నాయకులు కోరుతున్నారు.
మహబూబాబాద్‌లో పిచ్చికుక్కల స్వైర విహారం - Dog bite for 8 girls in Mahabubabad
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి. ఈ దాడిలో దాదాపు 8 మంది పిల్లలకు గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పట్టణంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని వాటిని నివారించాల్సిందిగా ప్రజలు, నాయకులు కోరుతున్నారు.