ఎంఎన్సీ బిల్లును వ్యతిరేకిస్తూ.. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఐఎంఏ ఆధ్వర్యంలో వైద్యులు ఆందోళన నిర్వహించారు. ఓపీ సేవలు రద్దు చేసి ప్రభుత్వ వైద్యశాల నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ తీశారు. ఎంఎన్సీ బిల్లును రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. ఎంఎన్సీ బిల్లును రూపొందించిన కమిటీలో డాక్టర్లు ఎవరూ లేరని ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ అన్నారు. ఈ పేద విద్యార్థులకు భారంగా మారుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే బిల్లులోని నిబంధనలను మార్పు చేయాలని కోరారు.
ఇదీ చూడండి: వర్షాకాలం జాగ్రత్త సుమీ- ఇట్లు.. హైదరాబాద్ పోలీస్