మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యునిగా పనిచేస్తున్న జగదీశ్ కరోనా నుంచి రక్షణకు లక్ష రూపాయల విలువ చేసే ఖరీదైన టెక్మెన్ పీఏపీఆర్ అనే మిషన్‌ను వైజాగ్ నుంచి తెప్పించుకున్నారు. గాలిలో ఉన్న బ్యాక్టీరియా, వైరస్‌లను ఫిల్టర్ చేసి శుభ్రమైన గాలిని అందిస్తుందని.. కరోనా నుంచి 99.9 శాతం రక్షణ ఇస్తుందని ఆయన అన్నారు.
శరీరానికి కావలసినంత ఆక్సిజన్‌ను సరఫరా చేయడంతో కండరాల నొప్పులు వంటి సైడ్ ఎఫెక్ట్స్ వంటివి ఏమీ ఉండవని చెప్పారు. దీని బ్యాటరీ 7 నుంచి 9 గంటలు పని చేస్తుందని తెలిపారు. ప్రతి రోజు దీన్ని శానిటైజ్ చేసుకోవాలని పేర్కొన్నారు. మిషన్‌ను ధరించడంతో డాక్టర్‌ను పట్టణంలోని ప్రజలంతా వింతగా చూస్తున్నారు.
ఇదీ చూడండి: ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తు గడువును పొడిగించిన ప్రభుత్వం