మహబూబాబాద్ జిల్లా మరిపెడలో డోర్నకల్ నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో వలస కూలీలకు నిత్యావసర సరకులు అందజేశారు. మండల తహసీల్దార్ వీర రాఘవ రెడ్డి, సీఐ కరుణాకర్ 70 కుటుంబాలకు సరకులు పంపిణీ చేశారు.
లాక్డౌన్ నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు చెందిన వలస కూలీలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం హర్షణీయమని సీఐ అన్నారు. దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : లాక్డౌన్ ఎఫెక్ట్: భారీగా పడిపోయిన చమురు విక్రయాలు