ETV Bharat / state

జిల్లావ్యాప్తంగా ప్రారంభమైన డిజిటల్​ తరగతులు - మహబూబాబాద్​ జిల్లా డిజిటల్​ తరగతుల వార్తలు

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా డిజిటల్ క్లాసులు ప్రారంభమయ్యాయి. ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు గ్రామాలు, తండాలలో తిరుగుతూ విద్యార్థులు ఆన్ లైన్ పాఠాలు ఏ విధంగా వీక్షిస్తున్నారో పరిశీలించి విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ, జిల్లా పరిషత్ ఛైర్​ పర్సన్ బిందు.. బయ్యారం, డోర్నకల్, మహబూబాబాద్ మండలాల్లోని కొన్ని గ్రామాల్లో కొంత మంది విద్యార్థుల ఇళ్లకు వెళ్లి విద్యార్థులు దూరదర్శన్, టి శాట్ ద్వారా పాఠాలు ఎలా నేర్చుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకున్నారు.

జిల్లావ్యాప్తంగా ప్రారంభమైన డిజిటల్​ తరగతులు

author img

By

Published : Sep 1, 2020, 7:25 PM IST

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా డిజిటల్ క్లాసులు ప్రారంభమయ్యాయి. చాలా గ్రామాల్లో ఇద్దరు, ముగ్గురు, మరికొన్ని చోట్ల ఐదారుగురు విద్యార్థులు ఒకే చోట కూర్చొని టీవీ, సెల్ ఫోన్లలో ఆన్ లైన్ పాఠాలను వీక్షించారు. ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు గ్రామాలు, తండాలలో తిరుగుతూ విద్యార్థులు ఆన్ లైన్ పాఠాలు ఏ విధంగా వీక్షిస్తున్నారో పరిశీలించి విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు.

మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ, జిల్లా పరిషత్ ఛైర్​ పర్సన్ బిందు... బయ్యారం, డోర్నకల్, మహబూబాబాద్ మండలాల్లోని కొన్ని గ్రామాల్లో కొంత మంది విద్యార్థుల ఇళ్లకు వెళ్లి విద్యార్థులు దూరదర్శన్, టి శాట్ ద్వారా పాఠాలు ఎలా నేర్చుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని 676 ప్రాథమిక, 120 మాధ్యమిక,100 హైస్కూల్​లలో 27 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని.. వీరిలో ఏజెన్సీ మండలాలైన బయ్యారం, కొత్తగూడ, గంగారం మండలాలకు చెందిన 450 మంది విద్యార్థులకు టీవీలు .. సెల్ ఫోన్ సిగ్నల్స్ అందుబాటులో లేవని సోమశేఖర శర్మ తెలిపారు. వారికి వర్క్​ షీట్స్​ను అందిస్తున్నామని, జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. విద్యార్థులకు గానీ, వారి తల్లిదండ్రులకు సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని కోరారు.

ఇవీచూడండి: వేలం పాట రద్దు.. ఈసారి బాలాపూర్​ లడ్డు ముఖ్యమంత్రి కేసీఆర్​కే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.