మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి శివారులో వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ తల తెగిపడింది. కరీంనగర్ నుంచి కాకినాడకు వెళ్తున్న గ్రానైట్ లారీని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం నుంచి కరీంనగర్ జిల్లా శ్రీరాంపూర్‌కు వెళుతున్న కర్రలారీ అదుపుతప్పి ఢీకొట్టింది. దీంతో కర్ర లారీ ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో మంచిర్యాలకు చెందిన లారీ డ్రైవర్ సత్యనారాయణ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఇరుక్కు పోయిన లారీలను వేరు చేసి మృతదేహాన్ని బయటకు తీశారు. సంఘటనా స్థలానికి తొర్రూరు డీఎస్పీ మదన్లాల్ చేరుకుని పరిశీలించారు.
ఇదీ చూడండి : బయోకెమి"కిల్స్"... పుట్టగొడుగుల్లా పురుగుమందుల ఉత్పత్తులు!