మహబూబాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వందల ఎకరాల్లో పత్తి పంట నాశనమైపోయింది. పంట చేతికొచ్చే సమయంలో నష్టపోవడం వల్ల అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు నష్ట పరిహారం అందించాలని దంతాలపల్లి గ్రామస్థులు కోరుతున్నారు. దెబ్బతిన్న పత్తిని చూపుతూ రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట తీరా చేతికి అందే సమయంలో వర్షాలతో దెబ్బతిందని అన్నదాతలు వాపోయారు. చెట్లపైనే పత్తి నల్లబడిపోవడం చూస్తుంటే పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని విచార పడుతున్నారు. దెబ్బతిన్న పత్తి పంటను అధికారులు పరిశీలించి పంట నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పిన ట్రంప్